శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం లోని ITDA పరిధిలో అమెజాన్ కంపెనీ సంబంధించిన జాబ్ మేళా సెప్టెంబర్ 5వ తేదీన జరుగుతుంది. ఈ మేళాలో అమెజాన్ కంపెనీ వారు సుమారు మూడు వందల ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నటుగా ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ వీవీ రమణ తెలిపారు. అమెజాన్ వారు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో పాల్గొనటానికి కనీస విద్య అర్హత పదో తరగతి కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ముపై సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీలు, పురుషులు అర్హులు.
సెప్టెంబర్ 5వ తేదీన జరిగే ఈ జాబ్ మేళాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నిరుద్యోగులు అందరూ పాల్గొనాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ వీవీ రమణ గారు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే విద్యార్థులు అందరూ వారి బయో డేటా కాపీ, ఆధార్ కార్డ్ రెండు పాస్ పోర్ట్ సీజ్ ఫోటోలు, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కాపీ తీసుకొని తొమ్మిది గంటలకు సీతంపేటలోని పీఎంఆర్సీ కు హాజరు కావాలి.
ఇక్కడ అమెజాన్ కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులను అమెజాన్ కంపెనీలో ముందుగా పదిహేను రోజు పాటు ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో ఉద్యోగానికి తీసుకుంటారు. అమెజాన్ కంపెనీ వాళ్ళు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు జీతం పది వేల రూపాయలు నుండి ఇరవై రెండు వేల రూపాయలు వరకు ఉంటుంది. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత ఉద్యోగం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వర్క్ ఫ్రొం హోమ్ మోడల్ లో అమెజాన్ ప్రొడక్ట్ బేస్ టెలి కాలర్ గా పనిచేయాలి. రెండవది హైదరాబాద్, బెంగళూరు లో ఉండే అమెజాన్ ఆఫీసులో పని చేయాలి.
శ్రీకాకుళం జిల్లా వివిధ ప్రాంతాల నుండి హాజరైన విద్యార్థులు సీతంపేట బస్ స్టాండ్ చేరుకొని అక్కడి నుండి సీతంపేటలో ఉన్న ITDA PMRC ఆఫీస్ చేరుకోవాలి. పీఎంఆర్సీ ఆఫీసులో అమెజాన్ కంపెనీ వారు ఇంటర్వ్యూలు నిర్వహించి మూడు వందల మంది ఉద్యోగులను ఎంపిక చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ వీవీ రమణ తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎటువంటి జాబ్ మేళా సీతంపేట పీఎంఆర్సీలో జరగడానికి ప్రధాన కారణం ITDA పరిధిలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో అమెజాన్ కంపెనీ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.
No comments:
Post a Comment