ఔరంగజేబు దక్కన్ లో ఫిబ్రవరి 20, 1707 నాడు మరణించాడు. 1707 నాటికి మొగలు సామ్రాజ్యం 21 సుభాలుగా విభజితమై ఉండేది. (ఉత్తర భారతదేశంలో 14, దక్షిణ భారతదేశంలో 6, కాబూల్ 1). ఔరంగజేబు తన ముగ్గురు కుమారులను ఆజం - గుజరాత్; మువ్వాజం - కాబూల్; కామ్భక్ష్ - బీజాపూర్ ప్రాంతాలకు ప్రతినిధులుగా నియమించాడు. ఔరంగజేబు మరణానంతరం జరిగిన వారసత్వా యుద్ధంలో మువ్వజం విజయం సాధించాడు. మువ్వజం బహదూర్ షా 1 బిరుదుతో మొగల్ సింహాసనాన్ని అధిష్టించాడు. 1679లో ఔరంగజేబుచే విధించబడిన జిజియా పన్నును బహదూర్ షా 1 తొలగించాడు. బహదూర్ షా 1 కు 'షా- ఏ - బెకబర్' అనే బిరుదునిచ్చిన మొగలు చరిత్రకారుడు కాఫీఖాన్. ఔరంగజేబు నిర్బంధించిన మరాఠా రాజు 'సాహు' ను బహదూర్ షా 1 విడుదల చేసాడు. మరాఠాలకు దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాలలో చౌత్, సర్ధేశ్ ముఖిలను వసూలు చేసే అధికారాన్ని బహదూర్ షా 1 కల్పించాడు. మేవార్, మార్వార్ లు బహదూర్ షా 1 కాలంలో స్వతంత్ర మయ్యాయి. ఔరంగజేబుచే 'దీన్ పనా' (మత సంరక్షకుడు) అనే బిరుదు పొందిన అతని కుమారుడు కామ్ భక్ష్'. సర్వహింద్ గవర్నర్ వాజీర్ ఖాన్ ను హత్యచేసి సట్లెజ్, యమునా నదుల మధ్య ప్రాంతాన్ని సిక్కుల ఏలుబడిలోకి తెచ్చినది బందా బహదూర్. డిసెంబర్, 1710 లో బహదూర్ షా 1, బందా బహదూర్ ను లోహఘడ్ లో జరిగిన యుద్ధంలో ఓడించాడు. సిక్కుల పదో గురువైన గురుగోబింద్ సింగ్ కు రాచపదవి కల్పించుట ద్వారా సిక్కులతో సఖ్యత కుదుర్చుకున్న మొగలు చక్రవర్తి బహదూర్ షా 1. బుం దే లా నాయకుడు ఛత్రసాల్, జాట్ ల నాయకుడు చురమాన్ లను మొగలుల ఆస్థానంలోకి తీసుకున్న చక్రవర్తి బహదూర్ షా 1. ఫిబ్రవరి 27, 1912 న 68 వ ఏట మరణించిన బహదూర్ షా 1 ఢిల్లీ లో సమాధి చేయబడ్డాడు.
Saturday, 7 January 2023
Subscribe to:
Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2026
(24)
-
▼
April
(6)
- ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్...
- SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 రిక్రూట్మెంట్ 2026 నో...
- ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ 2026 - 78...
- NCL ట్రైనీ రిక్రూట్మెంట్ 2026: 577 HEMM ఆపరేటర్, ...
- ఇస్రో యుఆర్ఎస్సి రిక్రూట్మెంట్ 2026 - సైంటిస్ట్...
- దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ...
-
▼
April
(6)