స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC జూనియర్ ఇంజనీర్(Junior Engineer) పేపర్ 2 పరీక్ష తేదీని ప్రకటించింది. జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులకు సంబంధించి సెకండ్ పేపర్ ను 26 ఫిబ్రవరి 2023న నిర్వహించనున్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC జూనియర్ ఇంజనీర్(Junior Engineer) పేపర్ 2
పరీక్ష తేదీని ప్రకటించింది. జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్,
ఎలక్ట్రికల్) పోస్టులకు సంబంధించి సెకండ్ పేపర్ ను 26 ఫిబ్రవరి 2023న
నిర్వహించనున్నారు. SSC JE పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక
వెబ్‌సైట్ ssc.nic.inని
సందర్శించడం ద్వారా పరీక్ష తేదీని తనిఖీ చేయవచ్చు. పేపర్ 2 తేదీలను
ప్రకటించినప్పటి నుండి.. అభ్యర్థులు పేపర్ 1 ఫలితాలు ఎప్పుడు విడుదల
అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. పేపర్ 2 పరీక్ష తేదీ వెల్లడించడంతో త్వరలో
పేపర్ 1 ఫలితాలు విడుదల కానున్నాయి. పేపర్ 1లో షార్ట్‌లిస్ట్ చేసిన
అభ్యర్థులు మాత్రమే పేపర్ 2కు అర్హత ఉంటుంది.