Intelligence Bureau : విశాఖపట్నంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IB Recruitment 2023 : కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau).. విశాఖపట్నంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభమవుతాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 రాత పరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.mha.gov.in/ వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్‌లో చూడొచ్చు.