SSC MTS Havaldar Recruitment 2023 : 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. వీటిలో రీజియన్ల వారీగా 9,329 పోస్టులు ఉండగా..
ప్రధానాంశాలు:
- ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ రిక్రూట్‌మెంట్ 2023
- 12,523 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- ఫిబ్రవరి 17 దరఖాస్తులకు చివరితేది
SSC MTS Recruitment 2023 :
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్
పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల నోటిఫికేషన్ విడుదల
చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409
ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అయితే 12,523 ఖాళీలు
ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్
కమిషన్ (SSC) విడుదల చేసింది. వీటిలో రీజియన్ల వారీగా 9,329 పోస్టులు
ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు.. ఇక హవాల్దార్ పోస్టులు 529
ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్
పోస్టులు ఉండగా.. 529 హవాల్దార్ పోస్టులున్నాయి.
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022
మొత్తం ఖాళీల సంఖ్య: 12,523
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 11,994 పోస్టులు
- హవాల్దార్ (సీబీఐసీ, సీబీఎన్): 529 పోస్టులు (హైదరాబాద్-8)