Mother Tongue

Read it Mother Tongue

Friday, 3 February 2023

ఇంటర్‌ అర్హతతో హిందుస్థాన్‌ పెట్రోలియంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబై రిఫైనరీలో.. 60 అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, బేసిక్‌ ఫైర్ ఫైటింగ్ కోర్సు సర్టిఫికేట్‌తోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 25, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.590లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://www.hindustanpetroleum.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 60

  • అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ పోస్టులు: 30
  • అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్ పోస్టులు: 7
  • అసిస్టెంట్ ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆపరేటర్ పోస్టులు: 18
  • అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 5