Mother Tongue

Read it Mother Tongue

Friday, 3 February 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 1410 కానిస్టేబుల్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

(BSF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1410 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 1343, మహిళలకు 67 ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో అడ్వర్టైజ్మెంట్ ను పబ్లిష్ చేసిన 30 రోజుల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో (rectt.bsf.gov.in) తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

అర్హతల వివరాలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రుకులేషన్ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితి 18-25 ఏళ్లు.

ఎలా అప్లై చేయాలంటే:

Step 1: అభ్యర్థులు ముందుగా బీఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in ను ఓపెన్ చేయాలి.

Step 2: హోం పేజీలో కనిపించే Constable Tradesman post లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3:  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Step 4:  అప్లికేషన్ ను నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లింపును పూర్తి చేయాలి.

Step 5: అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవాలి.

Job Alerts and Study Materials