Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 8 February 2023

సాయుధ బలగాల్లో 83వేల ఉద్యోగాలు.. కొత్తగా 64వేల పోస్టులు నోటిఫై..

కేంద్ర సాయుధ బలగాల్లో జనవరి 1 నాటికి 83వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఆయా విభాగాల్లో మొత్తం 10,15,237 పోస్టులకు గాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 83 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో సీఆర్‌పిఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్),.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) , సశస్త్ర సీబాబల్ (ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్ విభాగాలు ఉన్నాయి. మొత్తం మంజూరైన ఉద్యోగాల్లో ప్రస్తుతం 83,127 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఈ ఖాళీలను 2023లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. సాయుధ బలగాల్లోని ఆయా విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ.. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, సంబంధిత బలగాల ద్వారా ఖాళీల్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో 32,181 పోస్టుల్ని భర్తీ చేయగా, అదనంగా 64,444 ఖాళీలను నోటిఫై చేశామని చెప్పారు. ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ వివిధ దశల్లో ఉందని.. 2023 లోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ ఉద్యోగ ఖాళీల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఓవర్‌టైమ్ పనిచేస్తున్నారని అనడం సరికాదన్నారు. సాయుధ బలగాల్లోని ఆయా బిభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోం శాఖ, యూపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి , సంబంధిత బలగాల ద్వారా ఖాళీల్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు, జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలని సిఆర్‌పిఎఫ్ నిర్వహిస్తుందని వివరించారు.

Job Alerts and Study Materials