Mother Tongue

Read it Mother Tongue

Saturday, 11 February 2023

1151 కానిస్టేబుల్‌ పోస్టులు పెరిగాయి.. మొత్తం పోస్టుల సంఖ్య 46,435

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. తొలుత నోటిఫికేషన్‌ విడుదల సమయంలో మొత్తం ఖాళీలను 24,369గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ కమిషన్‌ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా 1,151 ఖాళీలను కలపడంతో 46,435కు చేరింది. 10వ తరగతి విద్యార్హతగా పేర్కొన్న ఈ ఉద్యోగాలకు జనవరిలో రాతపరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. తాజా ప్రకటన ప్రకారం.. పెరిగిన పోస్టుల వివరాల్లోకెళ్తే.. బీఎస్‌ఎఫ్‌లో 21052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175.. మొత్తం 46,435 ఖాళీలున్నాయి.

Job Alerts and Study Materials