ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 19న
ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 411 పోస్టుల
భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన 291 పరీక్షా కేంద్రాల్లో
ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా.. 1,51,243
మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసు నియామక మండలి (APSLPRB) ఒక ప్రకటనలో
తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 2 వారాల్లోనే విడుదల
చేయనున్నట్లు APSLPRB వెల్లడించింది. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై
ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 23న ఉదయం 11
గంటల వరకు అభ్యంతరాల నమోదు చేయవచ్చు. అభ్యంతరాలను ఈమెయిల్
SCTSI-PWT@slprb.appolice.gov.in ద్వారా తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర
విధానాల్లోనూ అభ్యంతరాలను స్వీకరించరు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఆన్సర్ కీ కోసం వెబ్‌సైట్ లింక్ ఇదే Paper I and Paper II
