Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 1 March 2023

ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి


 శారీరక సామర్థ్య పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు విడుదల చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల (AP Constable Jobs) భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమినరీ ఎగ్జామ్ సైతం పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను సైతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ప్రస్తుతం శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?

Step 1: అభ్యర్థులు మొదటగా https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో DOWNLOAD SCT PC PMT / PET CALL LETTER లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి.

Step 4: కింద డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

 జనవరి 22న ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB). రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి సంచలనం సృష్టించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు (AP Constable Jobs) సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో 4,58,219 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో కేవలం 95,208 మంది మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. వీరికి ఈవెంట్స్ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు.