Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 1 March 2023

ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్రత్రి (గవర్నమెంట్ జనరల్ ఆస్పతి) లో పలు ఉద్యోగాల (AP Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (AP Job Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధారంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను కడప ప్రభుత్వఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీలు వివరాలు:

డాక్టర్, అనస్తేషియా అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మార్చురీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, బార్డ్ బాయ్, స్ట్రెచర్ బాయ్, ఎంఎన్ఓ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.15 వేల వరకు పోస్టుల ఆధారంగా వేతనం ఉంటుంది.

అర్హతల వివరాలు:

వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు వేతనం ఉంటుంది. 8, 10, ఇంటర్, బీఎస్సీ, ఎంబీబీఎస్ పాసైన వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక ఇలా: అకాడమిక్ మార్కులకు 75 శాతం, ఇతర నిబంధనల ప్రకారం మరో 25 శాతం మార్కులు కేటాయిస్తారు. 

Job Alerts and Study Materials