ఈనెల 11న ఎస్సై(IT), ఏఎస్సై(ఫింగర్ ప్రింట్) పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఈనెల 6న ఉదయం 8 గంటల నుంచి 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB వెల్లడించింది. ఇందులో ఇబ్బందులు ఎదురైతే 9393711110, 9391005006 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. ఎస్సై పరీక్ష 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఏఎస్సై పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరగనుంది.
