Mother Tongue

Read it Mother Tongue

Sunday, 5 March 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ నుంచి మరో నోటిఫికేషన్ జారీ..


పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ తమిళనాడు సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాలను ఈ నోటిఫికేన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ తమిళనాడు సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాలను ఈ నోటిఫికేన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనబర్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 మధ్య చెల్లిస్తారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 58 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సెస్సీ తో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి.  దీంతో పాటే 3 ఏళ్ల పని అనుభవం కూడా అవసరం. మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx ద్వారా అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా రిజిస్ట్రర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నెం.37, గ్రీమ్స్ రోడ్, చెన్నై - 600 006. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 



Job Alerts and Study Materials