Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 28 March 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం..

 మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్(Assistant), సీనియర్ ల్యాబొరేటర్ అసిస్టెంట్(Senior Laboratory Assistant) వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు 12వ తరగతి, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అంతే కాకుండా.. సంబంధిత పనిలో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,900ల నుంచి రూ.19,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల విధానం..
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాలి. దరఖాస్తులను ఎంసీఈఎంఈ గేట్ వద్ద డ్రాప్ బాక్స్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ లను జత చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2023గా పేర్కొన్నారు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 05, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ వేదిక ఎఫ్ డీఈ, ఎంసీఈఎంఈ.
పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://indianarmy.nic.in/ సందర్శించండి.