అయితే.. ఏప్రిల్ 03న జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి ఆన్ లైన్ విధానంలో మూడు షిప్ట్ ల్లలో పరీక్షలను నిర్వహించారు. అయితే.. కొన్ని సెంటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. మొదటి రెండు షిప్ట్ లను విజయవంతగా పూర్తి చేయగా.. మూడో షిప్ట్ లో మాత్రం కొన్ని సెంటర్లలో ఆన్ లైన్ సమస్య తలెత్తింది. అందులో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో షిఫ్ట్ లో జూనియర్ అసిస్టెంట్ పరీక్ష జరగలేదు. దీంతో ఈ సెంటర్లో దాదాపు 150 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయలకేపోయారు. ఇక హైదరాబాద్ నాచారం టీసీఎస్ డిజిటల్ అయాన్ సెంటర్ 1 మరియు సెంటర్ 2 లో కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ఇక్కడ కూడా మూడో షిప్ట్ లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వాయిదా వేశారు. ఆన్ లైన్ ఎర్రర్ మెసేజ్ రావడంతో.. అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. వీటితో పాటు కర్మాన్ ఘాట్ లో ని అయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో కూడా థర్డ్ షిప్ట్ లోని పరీక్షకు సాంకేతిక సమస్య కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే తాజాగా హైకోర్టు దీనిపై స్పందించి.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ నాలుగు సెంటర్లలో ఎవరైతే పరీక్షలు రాయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారో వాళ్లకు మళ్లీ.. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీళ్లకు సంబంధించి హాల్ టికెట్స్ ను ఏప్రిల్ 10 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య ఏర్పడితే.. 040 23688394 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
