ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 243 ఉద్యోగాలను భర్తీ చేయనన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 243 పోస్టుల్లో 61 పోస్టులు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ సీడీపీఓ పోస్టులకు సంబంధించి ఇటీవల తెలంగాణలో కూడా నోటిఫికేషన్ విడుదల చేసి.. పరీక్షను కూడా నిర్వహించారు. తాజాగా ఏపీపీఎస్సీ ద్వారా ఏపీలో ఖాళీగా ఉన్న ఈ 61 పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. ఇక వీటితో పాటు.. అసిస్టెంట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు కూడా ప్రభుత్వం ఆమోదించిన వాటిలో ఉన్నాయి. 161 గ్రేడ్–1 సూపర్‌వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 243 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు జరగనున్నాయి. రెగ్యూలర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో సీడీపీఓ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పోస్టులకు సంబంధించి అర్హత, అప్లికేషన్ తేదీలు లాంటి వివరాలు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలవనున్నాయి.
