Mother Tongue

Read it Mother Tongue

Monday, 10 April 2023

అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలివే!

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) లోని వివిధ మండలాలలోని అంగన్వాడీ పోస్టులకు (Anganwadi jobs) నోటిఫికేషన్ విడుదల చేయబడింది . గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు గర్భిణీలు, చిన్నపిల్లలకు పౌష్టికి ఆహారం లోపం రాకుండా వారికి పౌష్టిక ఆహారం అందించడంతో అంగన్వాడి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ అంగన్వాడి కేంద్రాలలో టీచర్, హెల్పర్లు పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వివిధ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ మండలాల్లోని ఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి, చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ కవితా దేవి తెలిపారు. స్థానిక వివాహితులు, మహిళలు తమ దరఖాస్తులను కొత్తపల్లి సిడిపిఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.

అంగన్వాడీ కార్యకర్తలు రామగిరి మండలం గరినేకులపల్లి (బీసీ-సీ) చెన్నై కొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లికి (బీసీ-ఈ) అంగన్వాడీ హెల్పర్స్ రామగిరి మండలంలోని రెడ్డివారి పల్లి (ఓసి), తిమ్మాపురం మెయిన్ (బిసి-డి), గరీమేకలపల్లి మెయిన్ (ఎస్సి), చెన్నై కొత్తపల్లి మండలం ప్యడింది మెయిన్ (బిసి-బి), ముష్టి కోవెల మెయిన్( ఓసి), కనుముక్కల (బిసి-డి) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలోని చోళ సముద్రం, నాయన పల్లి గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ తెలిపారు.

పెనుగొండ మండలంలోని కొత్తపేట, శ్రీరాములయ్య కాలనీ, బిటిఆర్ కాలనీ, దుద్దే బండ, రొద్దం-2, తురకల పట్నం, ఎర్రమంచి, శేషాపురం-2, వజ్రాల పేట, జానకి రామయ్య కాలనీలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సిడిపిఓ కాంత లక్ష్మి తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 12వ తారీకు సాయంత్రం ఐదు గంటలలోపు సంబంధిత ఆఫీసులో అప్లై చేసుకోవాలని తెలిపారు. వీరిని ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా అర్హులని ప్రకటిస్తారు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Job Alerts and Study Materials