తెలంగాణలోని(Telangana) సంక్షేమ గురుకులాల్లో ఇటీవల మొత్తం 9,231 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా 9 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్(Librarian) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో పాటు.. టీజీటీ పోస్టులు (TGT Posts) 4,020, జూనియర్ కాలేజీల్లో 2008 జూనియర్ లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ పోస్టులు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశారు.
అయితే.. దీనికి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమవుతుందని ఇటీవల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా మల్లయ్య భట్టు చెప్పారు. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది.
దరఖాస్తులు మాత్రం వారం రోజుల్లో ప్రారంభం అగును. డిగ్రీ కళాశాల లెక్చరర్స్, పీడీ, లైబ్రేరియన్ వంటి 868 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానుంది. వీటితో పాటు.. జూనియర్ కళాశాల లెక్చరర్స్, పీడీ, లైబ్రేరియన్ 2008 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి కూడా ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుల చేసుకోవడానికి మే 17న చివరి తేదీగా ప్రకటించారు. నెల రోజుల పాటు.. ఈ ప్రక్రియ కొనసాగనుంది. అదే రోజు పూర్తి నోటిఫికేషన్ రానున్నట్లు ప్రకటించారు.
పీజీటీ పోస్టులు మొత్తం 1276 ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటికి పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 24న విడుదల కానుంది. అదే రోజు దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. పాఠశాలలో లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 434 ఉన్నాయి. వీటికి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాలలో పీఈటీ పోస్టులు 275 ఉన్నాయి. వీటికి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్ లేదా ఆర్ట్ టీచర్ పోస్టులు 134 ఉన్నాయి. వీటిలో 134 ఆర్ట్ టీచర్ పోస్టులుండగా.. 02 మాత్రం డ్రాయింగ్ టీచర్ పోస్టులున్నాయి. వీటికి అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
క్రాఫ్ట్ ఇన్ స్ట్రక్టర్లు / టీచర్లు కేటగిరీలో మొత్తం 92 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా..దీనిలో క్రాఫ్ట్ టీచర్ పోస్టులు 88, క్రాఫ్ట్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులు 04 ఉన్నాయి. వీటికి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మ్యూజిక్ టీచర్ల కేటగిరీలో మొత్తం 124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా మే 24ను నిర్ణయించారు. ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్ల కేటగిరీలో మొత్తం పోస్టులు 4020 ఉన్నాయి. వీటికి మాత్రం దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 28 నుంచి ప్రారంభం అవుతాయి.
Job Alerts |
|---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
|---|---|---|
| 07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
| 07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
| 07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
| 07/04/2023 | రీజనింగ్ | Get Details |
| 07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
| టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
