
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొత్తం 194 FLC కౌన్సెలర్, FLC డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి జూలై 6, 2023 చివరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో FLC కౌన్సెలర్- 182, FLC డైరెక్టర్- 12 ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్సు జూన్ 15, 2023 నాటికి కనిష్టంగా 60 నుండి గరిష్టంగా 63 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, మెరిట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000- రూ. 60,000 చెల్లించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా పోస్ట్ చేయబడతారు.