నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో జనరల్ మేనేజర్ (లీగల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్), మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 8.
పోస్టుల వివరాలు
NHAI రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, క్రింద ఇవ్వబడిన పోస్ట్‌లలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
1) జనరల్ మేనేజర్ (లీగల్) లో 02 పోస్టులు కలవు
2) డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) లో 01 పోస్టు కలదు
3) మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) లో 03 పోస్టులు కలవు
4) అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) లో 03 పోస్టులు కలవు
వయోపరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు.
జీతం
జనరల్ మేనేజర్ (లీగల్) - రూ. 123100 నుండి రూ. 215900 వరకు ఉంటుంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) - రూ. 78800 నుండి రూ. 209200
మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) - రూ 15600 నుండి రూ 39100
అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) - రూ 9300 నుండి రూ 34800
ఎంపిక ప్రక్రియ
NHAIలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
NHAI Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్ NHAI Recruitment 2024 నోటిఫికేషన్
ఈ అడ్రస్ కి పంపాలి
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్న వారు తమ దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా నింపి సంబంధిత పత్రాలతో పాటు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి.
చిరునామా: DGM (HR/Admin)-III నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాట్ నెం. G5-&6, సెక్టార్-10, ద్వారక, న్యూఢిల్లీ-110075