ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ డివిజన్
ఏటీవీఎం( ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్)లో ఫెసిలిటేటర్ ఉద్యోగాలు
భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని మొత్తం 26
రైల్వే స్టేషన్లో 59 ఉద్యోగాలు ఉన్నాయి.
ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ డివిజన్ ఏటీవీఎం( ఆటోమేటిక్ టికెట్
వెండింగ్ మెషీన్)లో ఫెసిలిటేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని మొత్తం 26 రైల్వే స్టేషన్లో 59
ఉద్యోగాలు ఉన్నాయి.
అయితే ఈ ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు
రాస్తున్నారంటూ దక్షిణ మధ్య రైల్వే దృష్టికి వచ్చిందని.. ATVM ఫెసిలిటేటర్
ఉద్యోగ పాత్ర అనేది జీతం పొందే స్థానం కాదని.. కేవలం బోనస్ ఆధారితంగా
కమిషన్ ద్వారా డబ్బులను సంపాదించే ఉద్యోగం అంటూ క్లారిటీ ఇచ్చింది. దీనికి
సంబంధించి ట్విట్టర్ వేదికగా.. క్లారిఫికేసన్ నోటీస్ ను పోస్ట్ చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల
సమాచారం కోసం ఎలాంటి ప్రైవేట్ సైట్లపై ఆధారపడవద్దని.. అధికారిక సైట్ https://scr.indianrailways.gov.in/ ను మాత్రమే సందర్శించాలని అభ్యర్థులను కోరింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే 10th అర్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు
దరఖాస్తు చెయ్యడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం 15
జూలై వరకు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో
పంపించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు
చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు
కూడా ఉంటుంది. OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం26 రైల్వే స్టేషన్లలో 59 పోస్టులను భర్తీ
చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా విజయవాడ స్టేషన్ లో 9 పోస్టులు
ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 150km కు 3 శాతం కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే
మనకు జీతం రూపంలో లభిస్తుంది. రైల్వే ప్రయాణికులకు అన్ రిజర్వ్ డ్
కేటగిరీలో టికెట్లను మిషన్ల ద్వారా జారీ చేయడం ఈ ఫెసిలిటేటర్ ఉద్యోగం.