Mother Tongue

Read it Mother Tongue

Thursday, 20 June 2024

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. పది పాసైతే చాలు..పరీక్ష లేకుండానే నియామకం

 

నిరుద్యోగులకు భారీ శుభవార్త.

Post Office GDS Recruitment: నిరుద్యోగులకు భారీ శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (GDS)పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఇండియన్‌ పోస్ట్‌ రెడీ అవుతోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది.
రాత పరీక్ష లేకుండానే కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ , ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైనవాళ్లు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(BPM), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు ఎంపికైనవాళ్లు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. పోస్టును బట్టి రూ.10-12 వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో  ప్రోత్సాహం అందిస్తారు.


Job Alerts and Study Materials