ఆసక్తి ఉన్నవారు 10వ తరగతి మార్క్ లిస్ట్ తో పాటు ఆధార్ కార్డ్ తీసుకొని ఈ నెల 30వ తేదీ లోపు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీస్ నందు గల ఎం టి ఓ ఆఫీస్ నందు సంప్రదించగలరు.
10వ తరగతి చదువుకొని ఇంటి దగ్గర ఉన్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. రోజుకు 400 చొప్పున కూలీ వచ్చే ఉద్యోగం ఉన్నదని రక్షణ శాఖ సిబ్బంది నుంచి కబురు పెట్టారు. చిత్తూరు పట్టణంలో కానీ ఆ పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. కానీ వయసు మాత్రం 21 పైన 40 ఏళ్లు లోపల వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఇంతకీ ఈ ఉద్యోగం అవకాశం ఎక్కడంటే.. చిత్తూరు పట్టణము నందు దర్గా కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్. త్వరలో ఇక్కడ పెట్రోల్ బంకునుప్రారంభించనున్నారు.
ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్ నందు పంప్ బాయ్స్ గా పని చేయుటకు 10వ తరగతి పాస్ అయిన 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయసు గల వారు ఇందుకు అర్హులని తెలిపారు. నెలకు రూ.12,000 జీతం ఇవ్వబడునని తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు 10వ తరగతి మార్క్ లిస్ట్ తో పాటు ఆధార్ కార్డ్ తీసుకొని ఈ నెల 30వ తేదీ లోపు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీస్ నందు గల ఎం టి ఓ ఆఫీస్ నందు సంప్రదించగలరని ఆర్.ఐ భాస్కర్ తెలిపారు.ఇతర సమాచారం కొరకు ఆర్.ఐ,ఎం టి ఓ 94910 74516 నెంబర్ ను సంప్రదించగలరన్నారు.