తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board), అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్ట్‌లకు భారీగా ఖాళీలను ప్రకటించింది. ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, 2024లో మొత్తం 18,799 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
రైల్వే నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board), అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్ట్‌లకు భారీగా ఖాళీలను ప్రకటించింది.
ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, 2024లో మొత్తం 18,799 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇది గతంలో ప్రకటించిన 5,696 ఖాళీల కంటే చాలా ఎక్కువ. ఈ భారీ పెంపుతో, దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
దీనికి సంబంధించి విడుదలైన అఫీషియల్ నోటిఫికేషన్‌లో, ‘అభ్యర్థులు అవసరమైతే ఎంచుకున్న RRB ఆప్షన్‌ను మాడిఫై చేసుకోవచ్చు. ఎంచుకున్న RRBలో జోనల్ రైల్వేల ప్రిఫరెన్సులు కూడా సర్దుబాటు చేయవచ్చు. ఈ మార్పులను చేయడానికి, అధికారిక వెబ్‌సైట్‌లలో త్వరలోనే ఒక లింక్ అందుబాటులోకి వస్తుంది. ఈ లింక్ కేవలం 10 రోజుల పాటు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.’ అని పేర్కొంది.
త్వరలోనే ఎగ్జామ్ షెడ్యూల్ : RRB ఆగస్టులో కంప్యూటర్-బేస్డ్ టెస్ట్-1 (CBT-1) నిర్వహిస్తుంది. అఫీషియల్ ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. క్యాండిడేట్స్ CBT-1 షెడ్యూల్ చేసిన తేదీకి సుమారు పది రోజుల ముందు తమ RRB ALP అడ్మిట్ కార్డు 2024ను అందుకుంటారు. ఈ CBT అభ్యర్థి ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైటికల్ కేపబిలిటీస్ వంటి మెంటల్ ఎబిలిటీస్‌ని టెస్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే కంప్యూటర్స్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
ఎగ్జామ్స్ క్లియర్ అయ్యాక వెరిఫికేషన్ : CBT స్టేజెస్ సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అర్హతను నిర్ధారించడానికి క్యాండిడేట్స్ సర్టిఫికెట్స్ చెక్ చేస్తారు. ఉద్యోగం చేయగలిగే అంత ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది దానికి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అఫీషియల్ RRB వెబ్‌సైట్‌లను సందర్శించి, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందాలని అధికారులు సూచించారు.
అర్హత ఏంటి? : RRB అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు అప్లై చేసుకునేవారి వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులో పేర్కొన్న డేట్ ఆఫ్ బర్త్ మెట్రిక్యులేషన్/SSLC సర్టిఫికెట్‌లోని డేట్ ఆఫ్ బర్త్‌తో మ్యాచ్ అవ్వాలి. పుట్టిన తేదీని తర్వాత మార్చడానికి అనుమతి లేదు. ఏవైనా తేడాలుంటే డిస్‌క్వాలిఫై అవుతారు. సక్సెస్‌ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్‌కు కచ్చితమైన సమాచారం అందించడం చాలా ముఖ్యం.
విద్యా అర్హత ఎలా ఉండాలి? : మెట్రిక్యులేషన్/SSLC పరీక్షలో పాసై ఉండాలి. గుర్తింపు పొందిన NCVT/SCVT సంస్థ నుంచి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటినెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో ITI సర్టిఫికెట్ సాధించి ఉండాలి. లేదా, గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతో పాటు మెట్రిక్యులేషన్/SSLC పాసై ఉండాలి. ITI సర్టిఫికెట్‌కు బదులుగా ఈ ఇంజనీరింగ్ డిప్లొమాను పొందవచ్చు.