నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నీ భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నీ భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షలను నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగానే ఇటీవల డీఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫసీర్, గ్రూప్ 1 వంటి పోస్టులకు పరీక్షలను నిర్వహించింది. జులై నెల నుంచి డీఎస్సీ పోస్టులకు పరీక్షలను నిర్వహించేందుకు జిల్లాలోని అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
అంతే కాకుండా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లను కూడా విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఆర్టీసీ)లో 3 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇదిలా ఉండగా.. 33 జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1830 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా.. 96 టీచర్ పోస్టులు, 395 ఆయా పోస్టులు గతంలోనే ఖాళీగా ఉన్నాయి.
ఇప్పుడు రిటైర్ అయ్యే వారితో కలిపితే ఈ పోస్టులు భారీగా పెరిగాయి. 177 టీచర్ పోస్టులు, 599 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
ఈ విషయాన్ని ఇటీవల సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల పోస్టుల ఖాళీగా ఉండగా.. వీటిని నోటిఫికేషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నారు.