ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుంది. నెల సరీ జీతం గల ఉద్యోగం కల్పిస్తున్నది. ఈ సువర్ణావకాశం గల జాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దేశం కోసం సేవ చేసి, ప్రాణాలను సైతం తెగించి.. కంటి నిండా నిద్రలు లేని రాత్రులు గడుపుతారు సైనికులు. క్రమ శిక్షణకు పేరు గాంచి, స్వార్థం లేకుండా ఉద్యోగంలో పని చేసి, భార్య, పిల్లలు,కుటుంబాన్ని వదిలినిస్వార్థంగా కష్టపడి విరామం తీసుకొంటున్న సోల్జర్స్ కోసం ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుంది. నెల సరీ జీతం గల ఉద్యోగం కల్పిస్తున్నది. ఈ సువర్ణావకాశం గల జాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదే క్రమంలోనే చిత్తూరు , తిరుపతి జిల్లాలోని భారతీయ స్టేట్ బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న మాజీ సైనికులు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయశంకర్రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. పలు వివరాలను వెల్లండించారు.
ఎస్ బీఐ బ్యాంకులలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు మాజీ సైనికులు అర్హులన్నారు. కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తెలిపారు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య గల మాజీ సైనికులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జీతం దాదాపు రూ.26 వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న మాజీ సైనికులు దరఖా స్తులను చిత్తూరు జిల్లా కేంద్రంలోని సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 16 వ తేదీలోపు అందజేయాలని కోరారు.