ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి గుడ్ న్యూస్. లక్షల్లో జీతంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఐఐఎంసీ అధికారిక వెబ్‌సైట్ iimc.gov.in ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
IIMC రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ ఆఫీసరల్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (ఆడియో/వీడియో) లైబ్రరీ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హత, ఏజ్ లిమిట్ నిర్దారించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరితేదీ 2024 ఆగస్టు 5.
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,000-1,77,500 వరకు రేంజ్‌ను బట్టి జీతాలు అందించనున్నారు. అసిస్టెంట్ లైబ్రరీ జీతం రూ. 44,000-1,42,000, అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ. 35,000-1,12,000 వరకు జీత భత్యాలు ఉంటాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆగస్టు 12 లోగా మీ అప్లికేషన్ ఇన్స్టిట్యూట్ కి చేరాలి. కావాలసిన డాక్యుమెంట్స్ అన్నీ జతపరిచి పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ విజిట్ చేసి డిటైల్డ్ నోటిఫికేషన్ చూడండి.