విభిన్న ప్రతిభావంత విద్యార్దులకు ఉన్నత విద్య అభ్యసించే విధంగా ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి.
విభిన్న ప్రతిభావంత విద్యార్దులకు ఉన్నత విద్య అభ్యసించే విధంగా ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగాభారత ప్రభుత్వము విభిన్న ప్రతిభావంత విద్యార్ధులకు జాతీయ ఉపకార వేతనములు మంజూరు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంత శాఖ అధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
9, 10వ తరగతి చదువుచున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, ఇంటర్ నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుచున్న దివ్యాంగ విద్యార్థులకు , పోస్ట్ మెట్రిక్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లమో చదువుచున్న దివ్యాంగ విద్యార్ధులకు , టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉపకార వేతనములు ఇస్తారు.
2024-25 విద్యా సంవత్సరంలో జాతీయ ఉపకార ‘వేతనములు మంజూరు కొరకు నేషనల్ ఉపకార వేతనములు పోర్టల్ www.scholarships.gov.in నందు దరఖాస్తు నమోదు చేసుకోవాలి.
ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అని తెలిపారు. ఫ్రీ-మెట్రిక్ ఉపకార వేతనములకు ధరఖాస్తు చేయుటకు చివరి తేదీ ఆగష్టు 31 అని తెలిపారు.
పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉపకార వేతనముల కు ధరఖాస్తు చేయుటకు ఆఖరు తేది అక్టోబర్ 31 అని తెలిపారు. ప్రతి ఒక్కటి 31 లోగా అప్లై చేసుకుంటే ఈ ఉపకార వేతనాలు వస్తాయన్నారు.
ఆసక్తిగల విభిన్న ప్రతిభావంతులు జాతీయ ఈ-ఉపకార వేతనముల నమోదుకు అర్హతలు, ఇతర సూచనల కొరకు వెబ్సైట్ www.depwd.gov.in మరియు www.scholarships.gov.in ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని తెలిపారు.
విభిన్న ప్రతిభావంతులు అవకాశం ఉన్నంత వరకు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని ఉద్దేశంతో ఈ అవకాశాలు కల్పిస్తున్నారని తెలియజేశారు.
ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ద్వారా ఉన్నత విద్యలు చదువుకున్నారని తెలియజేశారు. ఆఖరి తేదీ ముందే నమోదు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.