పదవ తరగతి పాసై కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించింది.ఇందులో ముఖ్యంగా 10వ తరగతి పాసై కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు ఉద్యోగ అర్హత కల్పించనుంది.
కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ అయినా ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో 10వ తరగతి
అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల అయింది.
ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోస్ట్ ఆఫీస్ సేవలను మరింతగా
చేరువ చేసేందుకు జిల్లాలోని మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న BPM/ABPM
పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ
తేదీన ప్రకటన వెలువడగా ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ
మొదలైంది.
అయితే ఈ నోటిఫికేషన్స్ లో భాగంగా కర్నూలు జిల్లాలోని మండల కేంద్రాల్లో 37
పోస్టులు భర్తీ కానున్నాయి. అదే విధంగా నంద్యాల జిల్లా డివిజన్ పరిధిలోని
మండల కేంద్రాల్లో 35 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన సంస్థ వాటిని
భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇండియన్ పోస్టల్ సర్వీస్
అనే వెబ్సైటు లో పొందుపరిచింది. ఈ పోస్టులకు సంబంధించి పదవ పాసైన వారు
అర్హులుగా తెలిపింది. పదవ తరగతి పాస్ అయి నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ ఓబీసీ
వర్గాలకు చెందిన నిరుద్యోగులు ఎందుకు అర్హులని తెలిపింది.
ఇందుకు సంబంధించి పదవ తరగతి పాసై కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని
సూచించింది.ఇందులో ముఖ్యంగా 10వ తరగతి పాసై కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి
ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు ఉద్యోగ అర్హత
కల్పించనుంది. అదే విధంగా కేవలం పదవ తరగతి పాసైనవారికి ఎలాంటి కంప్యూటర్
పరిజ్ఞానం లేకపోయినా ఎంపికైన వారికి ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు
జీతంగా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయాలనుకునే
అభ్యర్థులు పదవ తరగతి మార్క్ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిజిటల్
సిగ్నేచర్ వంటివి దగ్గర ఉంచుకొని https: //indiapostgdsonline.gov.in అనే
వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అభ్యర్థులు మొబైల్ ఫోన్
లో కూడా అప్లై చేసుకోవచ్చు.