వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టల్ శాఖ.
వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టల్ శాఖ. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి.
ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (Dak Sevak) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసేవారికి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. 18-40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఈ పోస్టులకు అప్లై చేసినవారి 10వ తరగతి మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి. ఆన్‌లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.