Mother Tongue

Read it Mother Tongue

Saturday, 3 August 2024

పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీగా జీతం

 హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జాబ్స్ ఉన్నాయి. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఇచ్చారు.

హైదరాబాద్ (Hyderabad) లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited) మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇటీవల కాలంలో వరుస నోటిఫికెషన్స్ జారీ చేస్తున్న ఈసీఐఎల్‌ (ECIL) హైదరాబాద్‌తో పాటు పలు జోనల్‌ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.

ఈ పోస్టుల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌- 20, టెక్నికల్ ఆఫీసర్‌- 53, జూనియర్ టెక్నీషియన్‌ (గ్రేడ్‌-2)- 42 ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులకు 33 ఏళ్ల వయసు, టెక్నికల్ ఆఫీసర్‌కు, జూనియర్ టెక్నీషియన్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. విద్యార్హతలో వచ్చిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్ పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తుల చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 8, 2024. ఇక జీతం వివరాలు చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుకు రూ.40,000- రూ.55,000, టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000- రూ.31,000, జూనియర్ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.22,528- రూ.27,258 జీతం ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.ecil.co.in/ చూడొచ్చు.