దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టల్ శాఖ. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం ఇప్పుడు చూద్దాం..
దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టల్ శాఖ. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఇప్పటికే సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
ఈ ఉద్యోగాలను కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కాగా, ఈ పోస్టులకు అప్లై చేసిన వారిలోంచి పదో తరగతి మెరిట్ లిస్ట్ త్వరలో విడుదల చేయనున్నారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను తపాలా శాఖ ఈ- మెయిల్ ద్వారా లేదంటే ఫోన్ నంబర్‌కు మెసేజ్ లేదా పోస్టు ద్వారా అలర్ట్ చేస్తుంది.
ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (Dak Sevak) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.
10వ తరగతి మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం ప్రకారం ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో జరుగుతుంది. వివిధ దశల్లో ఈ పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
పదో తరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ఫలితాలు ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు.