Mother Tongue

Read it Mother Tongue

Sunday, 1 September 2024

తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్.. TGPSC కీలక సమాచారం

 తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలకు అప్లై చేసిన అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 3 అప్లై చేసినవారికి తమ తమ అప్లికేషన్స్ లో ఏవన్నా పొరపాట్లు ఉంటే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని, అభ్యర్థులు తమ అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 6 అని పేర్కొంది. మరిన్ని వివరాలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Telangana Public Service Commission) అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.
ఈ నోటిఫికేషన్‌తో మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30వ తేదీన TSPSC Group 3 నోటిఫికేషన్ విడుదల చేసింది TSPSC. ఈ ఖాళీలకు 12 బీసీ గురుకుల సొసైటీ ఖాళీలతో కలిపి మొత్తం ఖాళీల సంఖ్య 1375కు చేరగా.. అనంతరం ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ గుర్తించింది. అంటే మరో 13 పోస్టులు జతకాగా మొత్తం పోస్టుల సంఖ్య 1388కి పెరిగింది. దేశవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 పోస్టులకు దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 3 పరీక్షలను నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.

గ్రూప్ 3 పరీక్ష విధానం

మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు రెండున్నర గంటల సమయం. గ్రూప్‌-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ఈ మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.