రైల్వే శాఖల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు విడుదల అవుతుంటాయి. తాజాగా రైల్వేలో ఖాళీగా ఉన్న 11,558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో మొత్తం 11,558 ఖాళీలను ప్రకటించారు. ఇందులో టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, ఫ్రైట్ ట్రైన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్, కమర్షియల్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హత: పోస్ట్ వారీగా మారుతుంది. 12వ తరగతి, డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. 12వ తరగతి విద్యార్హత ఉన్న పోస్టుకు గరిష్ట వయోపరిమితి 33 సంవత్సరాలు. కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. పరీక్షా విధానం: కంప్యూటరైజ్డ్ వ్రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 11,558 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13.10.2024. దరఖాస్తు నోటిఫికేషన్‌ను రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.