Mother Tongue

Read it Mother Tongue

Thursday, 24 October 2024

డిగ్రీ పాసయ్యారా? మీ కోసమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేల జీతం

 ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NTPC) నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది.

NTPC రిక్రూట్ చేస్తున్న ఈ పోస్టులకు గాను అక్టోబర్‌ 14వ తేదీ నుంచి అక్టోబర్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు https://ntpc.co.in/ వెబ్‌సైట్‌ చూడండి.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 27 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300. SC/ ST/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌- సర్వీస్‌మెన్‌/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల జీతం ఉంటుంది.