Mother Tongue

Read it Mother Tongue

Saturday, 9 November 2024

TG Group-4: గ్రూప్‌-4 అభ్యర్థులకు శుభవార్త..

 గ్రూప్-4 పరీక్ష రాసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నవంబర్ 14, 2024 నుంచి డిసెంబర్ 09 2024 వరకు ప్రజా విజయోత్సవాలు అంటూ తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ విజయోత్సవాల్లో భాగంగా గ్రూప్-4కు ఎంపికైన అభ్యర్థులకు నియామక సర్టిఫికెట్లు అందించనున్నట్లు.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినవారు ఉద్యోగం వస్తుందని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి 3 2023 తెలంగాణలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 9,51,321 దరఖాస్తు చేసినట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే 2023 జులైలో ఇందుకు సంబంధించిన పోటీ పరీక్ష తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.

ఈ ఏడాది ఆగస్టులో ప్రతిభ చూపి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యింది. ఇక అప్పటి నుంచి ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడు ఎంపిక చేసి, ఉద్యోగాలు తమకి అవకాశం కల్పిస్తారా అని వేచి చూస్తున్నారు.

ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన రావడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, చెప్పిన తేదీకే తుది ఫలితాలు ప్రకటించి.. ఉద్యోగాలు ఇస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఏది ఏమైనా ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అవుతుంది.