Mother Tongue

Read it Mother Tongue

Sunday, 13 April 2025

ప్రభుత్వం నుంచి శుభవార్త.. నెలకు రూ.30 వేల జీతంతో సొంత ఊరిలోనే ఉద్యోగం పొందండి..

 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 103 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం సర్వ శిక్ష అభియాన్ ఆఫీసు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు.

కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎమ్మెస్సీ, ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి, లేదా డిగ్రీలో సైకాలజీ ప్రధాన సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి. వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి. అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని ప్రకటించారు. జీతం రూ.30 వేలు ఉంటుందని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం అనగా జూన్-2025 నుంచి 10 నెలల పాటు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమగ్రశిక్ష అవసరాల మేరకు కాంట్రాక్టును కొనసాగించనున్నారు.

దరఖాస్తుల ఆన్‌లైన్ లింక్ https://forms.gle/7uTSuEuDMGHvyG7PA