ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 28 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి మెయిల్ ద్వారా పంపాలి. ఈ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక విధానం లాంటి డీటెయిల్స్ తెలుసుకోండి. మొత్తం ఖాళీలు 41 ఉండగా అందులో జూనియర్ అసోసియేట్ (IT)- 15, అసిస్టెంట్ మేనేజర్ (IT)- 10, మేనేజర్ (IT)- 9, సీనియర్ మేనేజర్ (IT)- 5, చీఫ్ మేనేజర్ (IT)- 2 పోస్టులున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. విద్యార్హతల వివరాలు చూస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AML,రిస్క్, అప్లికేషన్ సపోర్ట్ ఫర్ సీబీఎస్, సీఐఎస్, టెస్టింగ్ అండ్ రిలీజ్ లాంటి విభాగాల్లో కనీసం 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 55 ఏళ్ల లోపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా IPPB అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ ఓపెన్ చేయాలి. Careers సెక్షన్‌లో Information Technology Vacancies సెక్షన్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. అదే సెక్షన్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. careers@ippbonline.in మెయిల్ ఐడీకి అప్లికేషన్స్ పంపాలి. అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తుల్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే careers@ippbonline.in మెయిల్ ఐడీలో సంప్రదించాలి.
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(231)
-
▼
June
(45)
- నిరుద్యోగులకు శుభవార్త.. ECIL సీనియర్ ఆర్టిసాన్ రి...
- నిరుద్యోగులకు శుభవార్త.. UPSC రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్న...
- RRB NTPC UG అడ్మిట్ కార్డ్ 2025 విడుదల.. RRB NTPC ...
- BSF రిక్రూట్మెంట్ 2025 - 123 కానిస్టేబుల్, హెడ్ క...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC MTS నోటిఫికేషన్ 2025 ...
- ఇజ్రాయేల్ - ఇరాన్ మధ్య యుద్ధం (ఇప్పటి స్థితి - జూన...
- IAF AFCAT 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 - 284 ...
- ISRO ICRB సైంటిస్ట్/ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 - ...
- PFRDA ఆఫీసర్ గ్రేడ్ A రిక్రూట్మెంట్ 2025 - 20 పోస...
- సినీ తార నయన తార ధరించిన చీర కేవలం ₹1599/- మాత్రమే..
- 1850 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడు...
- SBI PO నోటిఫికేషన్ 2025 విడుదల.. దరఖాస్తు లింక్ ఇద...
- SSC CHSL నోటిఫికేషన్ 2025 విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్...
- ఒక రూపాయి చీర ఆఫర్ పోస్ట్ఫోన్ ..
- ప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.. NCRTC...
- సంవత్సరానికి రూ.49,50,000 శాలరీనా? అది కూడా డిగ్రీ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ప్రసార భారతి నుంచి నోటిఫి...
- నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర...
- వండర్ఫుల్ ఆఫ్ వైట్ సాఫ్ట్ సిల్క్ శారీ విత్ డెసిరిం...
- తెలంగాణ విద్యుత్ పంపణీ సంస్థలో 5,368 ఉద్యోగ ఖాళీలు..
- యువతకి శుభవార్త.. అమెజాన్‌లో అతి భారీగా ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త.. UPSC నుండి నోటిఫికేషన్ వి...
- నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతలో ఉద్యోగాలు..
- ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు, నైపుణ్యం కలిగిన మరియు సెమీ...
- టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1000 పైగా ప్రైవేట్ ఉ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్మెంట్ 20...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక...
- డిగ్రీ అర్హతతో ప్రైవేట్ ఉద్యోగాలు...
- 12వ తరగతి తర్వాత ఈ కోర్సుల్లో చేరండి.. లక్షల ప్యాక...
- ఇంటర్ తర్వాత ఏది చదివితే కెరీర్ ఎలా ఉంటుంది..?
- యువకులకు భారీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్మెంట్ 20...
- ఒక ₹(రూపాయ) కె ఫాన్సీ పట్టు చీర!
- నిరుద్యోగులకు శుభవార్త.. ECIL రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీల న...
- నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అప్రెంటిస్ రిక్రూట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి...
- నిరుద్యోగులకు బంగారు శుభవార్త.. ఇంటర్ అర్హతతో అసిస...
- Friday Offer on Khapraw Store
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC ఫేజ్ XIII సెలక్షన్ పో...
- RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ అడ్మిట్ కార్డ్ 2025 వి...
- నిరుద్యోగులకు శుభవార్త.. HPCL రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. C-DAC రిక్రూట్మెంట్ 2025...
-
▼
June
(45)