Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 February 2023

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో జాబ్స్... రేపే లాస్ట్ డేట్

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 28 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి మెయిల్ ద్వారా పంపాలి. ఈ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక విధానం లాంటి డీటెయిల్స్ తెలుసుకోండి. మొత్తం ఖాళీలు 41 ఉండగా అందులో జూనియర్ అసోసియేట్ (IT)- 15, అసిస్టెంట్ మేనేజర్ (IT)- 10, మేనేజర్ (IT)- 9, సీనియర్ మేనేజర్ (IT)- 5, చీఫ్ మేనేజర్ (IT)- 2 పోస్టులున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. విద్యార్హతల వివరాలు చూస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AML,రిస్క్, అప్లికేషన్ సపోర్ట్ ఫర్ సీబీఎస్, సీఐఎస్, టెస్టింగ్ అండ్ రిలీజ్ లాంటి విభాగాల్లో కనీసం 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 55 ఏళ్ల లోపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా IPPB అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ ఓపెన్ చేయాలి. Careers సెక్షన్‌లో Information Technology Vacancies సెక్షన్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. అదే సెక్షన్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. careers@ippbonline.in మెయిల్ ఐడీకి అప్లికేషన్స్ పంపాలి. అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తుల్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే careers@ippbonline.in మెయిల్ ఐడీలో సంప్రదించాలి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials