స్టాఫ్ సెలక్షన్ కమిషన్
(SSC) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C మరియు D రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022కు
సంబంధించి నైపుణ్య పరీక్షను(స్కిల్ టెస్టు) రద్దు చేసింది. ఈ మేరకు
ఎస్‌ఎస్‌సీ నోటీస్ జారీ చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం
ద్వారా వీటిని తనిఖీ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్
గ్రేడ్ C మరియు Dకు సంబంధించి స్కిల్ టెస్టును ఫిబ్రవరి 15న రెండు
షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించామని.. అయితే సాంకేతిక లోపాలు, ప్రాంతీయ
కేంద్రాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లకు సంబంధించి అభ్యర్థుల నుంచి పెద్ద
సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో రద్దు చేసినట్లు కమిషన్ జారీ చేసిన
నోటిఫికేషన్‌లో పేర్కొంది. 15 ఫిబ్రవరి 2023 (షిఫ్ట్ 2022) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి
ఎగ్జామినేషన్ 2022 యొక్క స్కిల్ టెస్ట్ సందర్భంగా గుర్తించిన సాంకేతిక
లోపాల గురించి అభ్యర్థుల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు .. కమిషన్
ప్రాంతీయ కార్యాలయాల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ దృష్ట్యా అధికారులు ఈ
నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే 1 మరియు షిఫ్ట్ 2
కమిషన్ ద్వారా రద్దు చేయబడింది. అయితే ఇది కేవలం ఫిబ్రవరి 15వ తేదీన స్కిల్ టెస్టు అటెండ్ అయిన వాళ్లకు
మాత్రమే అని.. ఆ రోజు ఆఫ్ సెంట్ అయిన వారికి వర్తించదని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 15 హాజరైన వాళ్లకు మళ్లీ పునఃపరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.
అయితే ఏ రోజు నిర్వహించే విషయాన్ని వెబ్ సైట్ ఆధారంగా తెలియజేయనున్నట్లు
తెలిపారు. స్టెనో గ్రేడ్ సి, డి స్కిల్ టెస్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ల
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను చూడాలని కమిషన్ కోరింది.
నోటీసును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.
-అభ్యర్థులు, ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లండి.
-దీని తర్వాత, అభ్యర్థి హోమ్‌పేజీలో ఇచ్చిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C&D పరీక్షకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.
-అప్పుడు మీ స్క్రీన్‌పై నోటీసు కనిపిస్తుంది.
-ఇప్పుడు అభ్యర్థులు నోటీసును తనిఖీ చేసి.. డౌన్లోడ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment