ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 28న జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో BYJUS, Apollo, Joy Alukkas తదితర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి NTR District లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Byjus: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. బిజినెస్ డవలపర్ ట్రైనీ, బిజినెస్ డవలప్మెంట్ అసోసియేట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఏదైనా పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు తెలంగాణ , ఏపీలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. వేతనం ఏడాదికి రూ.8.50 లక్షలు.
Innovsource Services: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. విజయవాడ , గుంటూరు , ఎన్టీఆర్ , కృష్ణ, బాపట్ల, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.
Apollo Pharmacies: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసిస్ట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు విజయవాడ, గుంటూరు, బాపట్ల, కృష్ణ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.
Job Alukkas: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది.
Technotask Business Solutions Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు బోనస్ ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, రమేష్ హాస్పటల్స్ రోడ్, విజయవాడ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment