Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 28 February 2023

జేఎన్ యూలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. 10, 12, డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం..

10, 12, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం ఏర్పడింది. ఈ రిక్రూట్‌మెంట్‌ల(Recruitment) కోసం దరఖాస్తు ప్రక్రియ కొంతకాలంగా కొనసాగుతోంది. వీటికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 10. ఈ రిక్రూట్‌మెంట్‌ కోసం దరఖాస్తు సమర్పించాలనుకునే అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో(Jawaharlal Nehru University) ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద అనేక బోధనేతర పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవచ్చు. దీని కోసం మీరు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దాని యొక్క వెబ్ సైట్ ఇదే jnu.ac.in. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం అయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 10, 2023. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి విద్యార్హత పోస్టును బట్టి భిన్నంగా ఉంటుంది. 10, 12 లేదా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస వయో పరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయో పరిమితి పోస్ట్ ప్రకారం మారుతూ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు ఉంటుంది. అనేక దశల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ముందుగా రాత పరీక్ష, ఆపై ఇంటర్వ్యూ, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్ని దశలను క్లియర్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడతారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీలు రూ.600 ఫీజు చెల్లించాలి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా.. జూనియర్ అసిస్టెంట్, MTS, స్టెనోగ్రాఫర్, కుక్, మెస్ హెల్పర్, వర్క్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రతీ విభాగంలో ఖాళీల సంఖ్య వేర్వేరుగా ఉంటుంది. అంటే జూనియర్ అసిస్టెంట్ విభాగంలో 106, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగంలో 179, మెస్ హెల్పర్ విభాగంలో 49, వర్క్స్ అసిస్టెంట్ విభాగంలో 16, ఇంజనీరింగ్ అటెండెంట్ విభాగంలో 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 388 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials