Mother Tongue

Read it Mother Tongue

Saturday, 18 February 2023

ఐడీబీఐ బ్యాంక్ లో 600 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. డిగ్రీ పాసైన వారికి ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి


 ఇటీవల బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా ఐడీబీఐ బ్యాంక్ (IDBI Jobs) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది బ్యాంక్. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది బ్యాంక్. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Registration) పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతల వివరాలు:

ఈ 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ లో ఆన్లైన్ టెస్ట్ ఉండే అవకాశం ఉందని బ్యాంక్ తెలిపింది.

- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ:

Step 1: అభ్యర్థులు మొదటగా బ్యాంక్ వెబ్ సైట్ https://www.idbibank.in/ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: తర్వాత Current Openings ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా వివరాలను నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.

Step 6: తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపి సబ్మిట్ చేసుకోవాలి.

Step 7: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials