తెలంగాణలో కొలువుల జాతర (Telangana Government Jobs) కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో ప్రకటించిన మేరకు 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీకి పలు నియామక సంస్థలు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 21 తో ముగిసింది. మొత్తం 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు గాను 40,100ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేపట్టనుంది తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు. ఈ రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో పాటు అదనంగా వెయిటేజీ మార్కులు కూడా కలపనున్నాయి. ఈ రెండింటినీ కలిపి తుది మెరిట్‌లిస్టును ప్రకటిస్తారు.
వెయిటేజీ ఇలా..
ఇప్పటికే ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్నవారికి, గతంలో పనిచేసినా వారికి వెయిటేజీ మార్కులు కేటాయించనుంది మెడికల్ బోర్డ్. రాత పరీక్షను 80 పాయింట్లకు, మిగిలిన 20 పాయింట్లకు వెయిటేజీ ఆధారంగా కేటాయించనున్నారు. ఇలా మొత్తం వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. వెయిటేజీ ప్రాంతాన్ని బట్టి కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన, చేస్తున్నవారికి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఇతర ప్రాంతాల్లో సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఉంటుంది. అంటే.. ఇతర ప్రాంతాల్లో 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులవుతారు.
No comments:
Post a Comment