Mother Tongue

Read it Mother Tongue

Monday, 20 February 2023

గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి హరీశ్‌రావ్‌.. త్వరలో 1400 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌


 తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. తాజాగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో 1400 ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ ఖాళీల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని మంత్రి (Harish Rao) ఆశాభావం వ్యక్తం చేశారు. నిమ్స్ లో 250 బెడ్స్, గాంధీలో 200 పడకలతో మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావ్‌ వివరించారు. ఓల్డ్ సిటీలోని ప్లేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఇన్ ఫెక్షన్ల నివారణ-అవగాహన కార్యమ్రానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పేట్ల బురుజు ఆస్పత్రి మాదిరిగానే.. ప్రతీ ఆస్పత్రి ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావ్‌ సూచించారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials