Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 22 February 2023

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 500 ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నట్లు ప్రకటించింది. మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (BOI Notification) పేర్కొంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జనరల్ బ్యాంకింగ్: ఈ విభాగంలో 350 ఖాళీలు ఉన్నాయి. ఐటీ ఆఫీసర్: ఈ విభాగంలో మరో 150 ఖాళీలు ఉన్నాయి.క్రెడిట్ ఆఫీసర్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్హతను పొంది ఉండాలి. ఐటీ ఆఫీసర్: కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అభ్యర్థుల ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కన్నారు. ఎలా అప్లై చేయాలంటే?
Step 1: అభ్యర్థులు మొదటగా బ్యాంక్ వెబ్ సైట్ bankofindia.co.in ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో Career ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 3: "Recruitment of Probationary in JMGS-I upon passing Post Graduate Diploma in Banking & Finance ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. 
Step 5: కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాలి.
Step 6: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భ్రదపరుచుకోవాలి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials