Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 February 2023

మార్చి 9 నుంచి SSC CHSL 2023 టైర్ 1 పరీక్షలు..

 SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు స‌రైన ప్రణాళితో ఉండాలి. ప్ర‌తీ సంవ‌త్సంర ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు పోటీ ప‌డుతుంటారు. ఈ ప‌రీక్ష‌లో రాణించి ఉద్యోగం సాధించాలంటే పూర్తి ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన ప్రిప‌రేష‌న్ ఉండాలి. ఈ సారి SSC CHSL 2023 రాసే అభ్య‌ర్థుల కోసం కొన్ని ప్రిపరేషన్ చిట్కాలు పాటిస్తే చ‌క్క‌ని ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఏ ప‌రీక్ష‌కైనా స‌న్న‌ద్ధ‌త ముఖ్యం, మీకు స‌బ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం ఉంటే ఈ ప‌రీక్ష పాస్ కాలేరు. విష‌య ప‌రిజ్ఞానంతోపాటు వేగంగా స్పందించే త‌త్వం ఉండాలి. త‌క్కువ స‌మ‌యంలో స‌రైన స‌మాదాన్నాన్ని ఎంచుకోవ‌డానికి స‌బ్జెక్ట్ మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన అభ్యాసం వ‌ల్ల మాత్ర‌మే క‌చ్చిత‌మైన స‌మాధానాల‌ను ఎంచుకోగ‌ల‌రు. 4500 ఖాళీలతో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్ష తేదీలను ఖరారు చేశారు. మార్చి 09 నుంచి మార్చి 21 వరకు ఈ పరీక్షలు జరగునున్నాయి. అడ్మిట్ కార్డులు కూడా విడుదల అయ్యాయి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 ఈ పరీక్షలో వ‌చ్చే విభాగాలు..

(i) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

 (ii) జనరల్ ఇంటెలిజెన్స్

(iii) ఇంగ్లీష్‌

(iv) జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్

టైర్ -1 ప‌రీక్ష‌కు సంబంధించి ముఖ్య‌మైన అంశాలు..

- SSC CHSL సాధారణంగా ప్రతి సంవత్సరం కొన్ని పునరావృతమయ్యే ప్రశ్నలు ఉంటాయి.

 ఈ అంశాల‌ను గుర్తిస్తే జనరల్ నాలెడ్జ్ చాలా స్కోరింగ్ కావచ్చు.

- గణితానికి సంబంధించిన బేసిక్స్‌పై ఎక్కువ ప్ర‌శ్న‌లు అడుగుతారు. కాబ‌ట్టి పెద్ద సూత్రాల కంటే మౌలిక సూత్రాల అభ్యాసం అవ‌స‌రం.

- SSC CHSL పరీక్ష తయారీకి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. సొంతంగా నోట్స్ చేసుకొవ‌డం వ‌ల్ల క‌రెంట్ ఎఫైర్స్ త‌ప్పులు లేకుండా ఆన్సర్ చేయొచ్చు.

- తెలుగు మీడియం (Telugu Medium) నుంచి వ‌చ్చే వారికి ఇంగ్లీష్ (English) కాస్త క‌ఠినంగా అనిపించినా.. పర్యాయపదాలు, వ్యతిరేకపదాలు, వన్-వర్డ్ సబ్‌స్టిట్యూషన్ & ఇడియమ్స్/పదబంధాలు అభ్య‌సం చేసినా మంచి స్కోర్ చేయొచ్చు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials