Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 22 February 2023

ఏపీ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. మార్చి 1 నుంచి కాల్ లెటర్లు.. మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే?

ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అలర్ట్. మార్చి 1 నుంచి ఈవెంట్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయాలని రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మెయిన్స్ అప్టేట్స్ ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను జనవరి 22న 33 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించింది. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగా.. 4,58,219 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహించిన కేవలం 15 రోజుల్లోనే ఫిబ్రవరి 2న ఫలితాలను విడుదల చేసి సంచలనం సృష్టించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ ఫలితాల్లో మొత్తం 4,58,219 మందికి గాను.. కేవలం 95,208 మంది మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన కాల్ లెటర్లను మార్చి 1న విడుదల చేయనున్నట్లు బోర్డు తాజాగా ప్రకటించింది. అభ్యర్థులు మార్చి 1 నుంచి 10వ తేదీలోగా తమ అధికారిక వెబ్ సైట్ slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఫిజికల్ టెస్ట్ లను మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ మొదటి వారంలో నిర్ణయించాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో అధికారికంగా విడుదల చేయనుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials