Mother Tongue

Read it Mother Tongue

Saturday, 25 February 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 577 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

 ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో పలు ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 577 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.  విభాగాల వారీగా ఖాళీల విషయానికి వస్తే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. నేటి నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 17, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 418 ఓపెనింగ్స్ ఉండగా.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కి 159 ఉద్యోగాలు ఉన్నాయి.  ఈ పోస్టులను యూపీఎస్సీ ద్వారా నియమించనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జీతం..

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి 7వ CPCకి అనుగుణంగా లెవెల్-08 పే మ్యాట్రిక్స్‌ను అందుకుంటారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రిక్రూట్‌లు 7వ CPCకి అనుగుణంగా లెవల్-10 పే మ్యాట్రిక్స్‌ను అందుకుంటారు. ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఇలా..

- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-వెబ్ సైట్ లో 'UPSC EPFO ​​2022 నోటిఫికేషన్' కనిపిస్తుంది. దీనిపై క్లిక్ ఇచ్చి.. 'అప్లై నౌ'పై ఆప్షన్ ఎంచుకోండి.

-ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనిలో మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీకి, పాస్‌వర్డ్‌ను అందుకుంటారు.

-అప్లికేషన్ పోర్టల్‌లో మీ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. మీ విద్యార్హతలను పూరించండి.

- తర్వాత ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించండి. దరఖాస్తును సమర్పించి, దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials